.
బుధవారం, నవంబర్ 11, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

Horoscope Today: నేటి రాశి ఫలాలు(11/11/2026)..ఈ 5 రాశుల వారికి అదృష్టం కలిసొచ్చేనా?

CH. Rakesh Reddy
Today Rasi Phalalu

Horoscope Today November 11, 2026: నవంబర్ 11, బుధవారం గ్రహగతుల ఆధారంగా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మేషం నుంచి మీనం వరకు ఎవరి ఉద్యోగ, వ్యాపార జీవితంలో అనుకూల మార్పులు కనిపించనున్నాయి? ఎవరికి ఆర్థికంగా కలిసిరానుంది? కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ, చదువు విషయాల్లో ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నేటి రాశిఫలాల్లో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మేషం: ఉద్యోగంలో గుడ్ న్యూస్.. ఆదాయం పెరిగే సూచనలు

మేష రాశి వారికి బుధవారం అనుకూలంగా ఉండనుంది. ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల సహాయం అందుతుంది. ఆదాయం పెరగడంతో ఇతరులకు సాయం చేసే స్థాయికి చేరుకుంటారు. మీ సలహాలు బంధుమిత్రులకు ఉపయోగపడతాయి. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కూడా సంతోషంగా సాగుతాయి.

వృషభం: పెళ్లి ప్రయత్నాల్లో పురోగతి.. ఆస్తి వివాదాలకు పరిష్కారం

వృషభ రాశి వారికి ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ప్రత్యేక బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారాల్లో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలతో పాటు పెళ్లి సంబంధాల విషయంలోనూ శుభవార్తలు వినవచ్చు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. అయితే స్నేహితుల కారణంగా ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు మరింత శ్రమించాలి. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది.

మిథునం: జీతం పెరిగే ఛాన్స్.. ఆర్థిక సమస్యలకు చెక్

మిథున రాశి వారికి ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మంచి రోజుగా చెప్పవచ్చు. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులు లాభపడతారు. జీతభత్యాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో పనులు పెరిగి బిజీగా గడుపుతారు. ఆదాయం పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యక్తిగత సమస్యలను పెద్దగా కష్టపడకుండానే పరిష్కరించుకునే అవకాశం ఉంది. విద్యార్థులు సులభంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

కర్కాటకం: నిరుద్యోగులకు శుభవార్త.. కుటుంబంలో చికాకులు

కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. మీ మాటకు విలువ లభిస్తుంది. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. అయితే కుటుంబ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు కొంత శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

సింహం: షేర్లలో లాభాలు.. పనిభారంతో ఒత్తిడి

సింహ రాశి వారికి బుధవారం పనులతోనే ఎక్కువ సమయం గడిచిపోవచ్చు. ఉద్యోగం, వ్యాపారాల్లో తీరికలేని పరిస్థితి ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరగడంతో మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకోవాల్సి వస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లలో అనుకూల ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆదాయం, ఆరోగ్యం విషయంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయితే ఇతరులకు తొందరపడి మాట ఇవ్వకండి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.

కన్య: ఆదాయం పెరుగుతుంది.. పెళ్లి ప్రయత్నాల్లో గుడ్ న్యూస్

కన్య రాశి వారికి ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. అయితే ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమించాల్సి రావచ్చు. గతంలో మీ నుంచి సాయం పొందిన కొందరు ఇప్పుడు దూరంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను ఇతరులపై వదిలేయకుండా మీరే చూసుకోవడం మంచిది. ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు అందవచ్చు. పిల్లల చదువు విషయంలో సాధారణ ఫలితాలు కనిపిస్తాయి. ప్రేమ జీవితంలో చిన్నపాటి సమస్యలు రావచ్చు.

తుల: ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.. నిరుద్యోగులకు అవకాశాలు

తుల రాశి వారికి బుధవారం ఉత్సాహంగా గడిచే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు కనిపిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు రావచ్చు. పెళ్లి ప్రయత్నాల్లోనూ పురోగతి ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గి పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబంలో ఉన్న చిన్నపాటి వివాదాలు కూడా పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతోషంగా సాగుతాయి.

వృశ్చికం: ఉద్యోగంలో గుర్తింపు.. ఆదాయం పెరిగే ఛాన్స్

వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. అయితే కొన్ని ముఖ్యమైన పనులు అనుకున్నంత వేగంగా పూర్తికాకపోవచ్చు. దీనివల్ల కొంత మానసిక ఒత్తిడి ఎదురవుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడానికి పట్టుదలతో ప్రయత్నించాలి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టాలి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

ధనుస్సు: చేపట్టిన పనుల్లో విజయం.. కుటుంబంతో శుభకార్యాలు

ధనుస్సు రాశి వారికి బుధవారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు మాత్రం ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకున్న పనులు పూర్తవుతాయి. మీరు చేపట్టే ప్రయత్నాలకు మంచి ఫలితాలు లభించే సూచనలు ఉన్నాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు పెరగవచ్చు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది.

మకరం: బాధ్యతలు పెరుగుతాయి.. డబ్బు లావాదేవీల్లో జాగ్రత్త

మకర రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం బాగానే ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అయితే ఇతరులతో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో శ్రమించాలి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం: ఉద్యోగంలో ఒత్తిడి.. నిలకడగా ఆదాయం

కుంభ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి పెరగవచ్చు. కొందరు పనివద్ద ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించిన స్పందన లభించవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఏలినాటి శని ప్రభావం కారణంగా పనుల్లో ఆలస్యం జరుగుతుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెంచాలి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంది.

మీనం: పదోన్నతికి ఛాన్స్.. వ్యాపారాల్లో ఊహించని లాభాలు

మీన రాశి వారికి బుధవారం మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో గుర్తింపు పెరగడంతో పాటు పదోన్నతికి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు రావచ్చు. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుతాయి. అయితే ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి కొంత ఖర్చు, శ్రమ అవసరమవుతాయి. ఆదాయం బాగున్నా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఇతరులతో డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతోషంగా సాగుతాయి.

మరిన్ని అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. వార్తల్లోని ముఖ్యమైన అంశాలను గుర్తించి, పాఠకులకు సులభంగా అర్థమయ్యే భాషలో, ఆసక్తికరమైన శైలిలో అందించడం ఆయన ప్రత్యేకత. తాజా పరిణామాలను వేగంగా గుర్తించడం, సమాచారాన్ని విశ్లేషించడం, వాస్తవాలను పరిశీలించి కథనాలుగా మలచడంలో ప్రత్యేక నైపుణ్యం ఉంది.