Anirudh Net Worth: రూ.50 కోట్ల ఆస్తి.. లగ్జరీ కార్లు.. కావ్య మారన్ భర్త అనిరుధ్ ఆస్తులు ఎంతంటే ?

Anirudh Net Worth: సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహ బంధంతో ఒకటయ్యారు. నవంబర్ 11న గ్రీస్‌లో వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లి వార్తతో అనిరుధ్ సంపాదన, ఆస్తులు, వ్యాపారాలపై కూడా ఆసక్తి పెరిగింది. వై దిస్ కొలవెరి డి పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే సంగీత దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. మీడియా కథనాల ప్రకారం, ఆయన నికర సంపద సుమారు రూ.50 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
ఒక్కో సినిమాకు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లు?
అనిరుధ్ రవిచందర్ సంగీతానికి సినీ పరిశ్రమలో మంచి డిమాండ్ ఉంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పలు భారీ చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాకు కూడా ఆయనే సంగీతం సమకూర్చారు. మీడియా నివేదికల ప్రకారం, ఒక్కో సినిమాకు అనిరుధ్ సుమారు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. కొన్ని ప్రత్యేక ప్రాజెక్టుల విషయంలో ఈ మొత్తం రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉంటుందని కూడా కథనాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో చేయబోయే ప్రాజెక్టు కోసం ఆయనకు సుమారు రూ.25 కోట్ల ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
లగ్జరీ కార్లంటే అనిరుధ్‌కు ఇష్టం
సంగీతం ద్వారా సంపాదించిన ఆస్తులతో పాటు అనిరుధ్ దగ్గర ఖరీదైన కార్లు కూడా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జైలర్ సినిమా విజయం తర్వాత 2023లో సన్ గ్రూప్ అధినేత కలానిధి మారన్ ఆయనకు పోర్షే మకాన్ కారును బహుమతిగా ఇచ్చినట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం వెల్లడించింది. ఈ కారు విలువ సుమారు రూ.1.1 కోట్లుగా పేర్కొంది. బీఎండబ్ల్యూ ఐఎక్స్1 ఎల్‌డబ్ల్యుబీ, మహీంద్రా బీఈ 6, ఫోర్డ్ మస్టాంగ్ జీటీ వంటి కార్లు కూడా ఆయన వాహనాల జాబితాలో ఉన్నట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆయన వద్ద ఉన్న మొత్తం కార్ల వివరాలు అధికారికంగా అందుబాటులో లేవు.
సంగీతంతో పాటు వ్యాపారంలోనూ అడుగు
అనిరుధ్ కేవలం సినిమాలు, సంగీత కార్యక్రమాలకే పరిమితం కాలేదు. వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. 2024లో దక్షిణ భారత ఫిల్టర్ కాఫీ, చిరుతిళ్ల బ్రాండ్ వీఎస్ మణి అండ్ కంపెనీతో ఆయన భాగస్వామిగా చేరారు. కంపెనీకి సహ వ్యవస్థాపకుడిగా, ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ భాగస్వామ్యంలో ఆయనకు సంస్థలో వాటా కూడా లభించినట్లు మనీకంట్రోల్ కథనం పేర్కొంది. దీంతో సినిమా పారితోషికాలకు అదనంగా వ్యాపారం ద్వారా కూడా ఆదాయం పొందే అవకాశం ఏర్పడింది.
కావ్య మారన్ ఆస్తి అనిరుధ్ కంటే ఎక్కువేనా?
ఇక కావ్య మారన్ ఆస్తుల విషయానికి వస్తే.. ఆమె సంపద అనిరుధ్ కంటే చాలా ఎక్కువగా ఉంటుందని పలు మీడియా కథనాలు అంచనా వేస్తున్నాయి. సన్ గ్రూప్ అధినేత కలానిధి మారన్ కుమార్తె అయిన కావ్య.. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓగా, సన్ టీవీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈటైమ్స్ కథనం ప్రకారం, ఆమె వ్యక్తిగత నికర సంపద సుమారు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా. అయితే దీనిపై అధికారిక లెక్కలు లేవు. మరోవైపు ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఆమె తండ్రి కలానిధి మారన్ సంపద సుమారు 2.5 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.24 వేల కోట్లకు సమానం. మొత్తంగా చూస్తే అనిరుధ్ సంగీత రంగంలో తనకంటూ భారీ సంపదను సంపాదించగా, కావ్య మారన్ కుటుంబ వ్యాపార నేపథ్యం కారణంగా ఆమె ఆస్తుల అంచనా మరింత ఎక్కువగా ఉంది.

Rice Bags: 25 కిలోల బియ్యం బస్తాలకు బైబై.. 26 కిలోల ప్యాకెట్ల వెనుక లెక్క ఇదే
Gold Rate Today: బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన పసిడి ధరలు
Amazon Diwali Sale 2026: అమెజాన్‌లో హెడ్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనేయండి
Gold Rate Today: బంగారం ధరలకు బ్రేకులు.. ఒక్కరోజే తులంపై రూ.1,930 తగ్గుదల