మంగళవారం, నవంబర్ 17, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

Weather Update: మునుపెన్నడూ లేని విధంగా తుఫాను ముప్పు.. ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్

Akvan Cyclone

Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాను తెలుగు రాష్ట్రాలను వణికించేందుకు సిద్ధమవుతోంది. భారత వాతావరణ విభాగం (IMD) అంచనా ప్రకారం మంగళవారం నవంబర్ 17 సాయంత్రానికి ఇది తీవ్ర తుఫానుగా బలపడనుంది. ఆ తర్వాత నవంబర్ 19 ఉదయానికి మరింత తీవ్రమై అతి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందనుంది. ఈ నవంబర్ 20 మధ్యాహ్నం సమయంలో ఆంధ్రప్రదేశ్ తీరంలోని నెల్లూరు అలాగే తుని మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

అక్వాన్ తుఫాను ప్రభావం నేటి నుంచే ఆంధ్రప్రదేశ్ పై స్పష్టంగా కనిపించనుంది. కోస్తా అలాగే రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రేపు నవంబర్ 18 తేదీన కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తాంధ్రలో అత్యంత భారీ వర్షాలు పడగా, రాయలసీమలోనూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండనుంది. తీరం వెంబడి గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో (గరిష్టంగా 145 కి.మీ) పెనుగాలులు వీస్తాయని, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

Read Also: CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. సీఎం విజయ్ సర్కార్ పడిపోతుందా?


తెలంగాణలోనూ వీయనున్న తుఫాను ప్రభావం

తెలంగాణలో నేడు నవంబర్ 17 తేదీన ప్రధానంగా పొడి వాతావరణమే కొనసాగనుంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎలాంటి ప్రత్యేక వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే అక్వాన్ తుఫాను తీరం దాటిన తర్వాత దీని ప్రభావం తెలంగాణపై పడనుంది. నవంబర్ 20, 21 తేదీల్లో మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ తదితర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఎలా ఉందంటే?

భాగ్యనగరంలో నేడు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, పొడిగా కొనసాగనుంది. ఉదయం వేళల్లో స్వల్పంగా మంచు, చలి గాలులు వీస్తుండగా, పగటిపూట ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే సూచన ఉంది. నేడు నగరంలో వర్షం కురిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే తుఫాను ప్రభావం కారణంగా రాబోయే నవంబర్ 21, 22 తేదీల్లో హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.