Bigg Boss 10 : బిగ్ బాస్ హౌస్ నుంచి వైల్డ్ కార్డ్ బ్యూటీ అవుట్.. స్టేజీ పైనే కన్నీళ్లు పెట్టుకున్న శ్వేత

Bigg Boss 10 : బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు రియాలిటీ షోలో పదో వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తియింది. ఈ వారం హౌస్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అందరూ భావించినప్పటికీ, చివరికి శ్వేత ఒక్కరినే ఎలిమినేట్ చేస్తూ బిగ్ బాస్ టీమ్ నిర్ణయం తీసుకుంది. నామినేషన్స్‌లో ఉన్న వారందరిలో శ్వేతకు అత్యల్ప ఓట్లు రావడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. శ్వేత ఎలిమినేట్ కావడంతో అమన్ ఊపిరి పీల్చుకున్నాడని చెప్పవచ్చు. గత కొంతకాలంగా అమన్, శ్వేత మధ్య నడుస్తున్న ట్రాక్ వల్ల బయట కాస్త నెగెటివిటీ వస్తుందనే ఆందోళన అభిమానుల్లో ఉండేది. ఇప్పుడు శ్వేత వెళ్ళిపోవడంతో అమన్ పూర్తిగా తన ఆటపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
స్టేజ్ మీద ఎమోషనలైన శ్వేత
హౌస్ నుంచి బయటకు వచ్చిన శ్వేత నాగార్జున ముందు తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా నాగ్ ఇచ్చిన ఒక చిన్న టాస్క్‌లో శ్వేత మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అమన్ చాలా మంచివాడు, ఇన్నోసెంట్ అని చెబుతూనే, అతనికి ఒక కత్తిని డెడికేట్ చేశారు. ఎదుటి వాళ్ల విషయంలో సెల్ఫ్‌లెస్‌గా ఉంటూనే తన ఆట తాను స్మార్ట్‌గా ఆడాలని అమన్‌కు సలహా ఇచ్చారు. అమన్ విన్నర్ కావాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు శ్వేత స్పష్టం చేశారు. అలాగే దేబ్జానీకి వేకప్ కాల్ ఇస్తూ సొంత నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Gig Workers: గిగ్ వర్కర్లకు సర్కార్ గుడ్ న్యూస్.. రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్
పదకొండో వారంలో డిక్టేటర్ల థీమ్
పదో వారం ఆట ముగియడంతో ఇక పదకొండో వారం కోసం బిగ్ బాస్ కొత్త థీమ్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డిక్టేటర్స్ పేరుతో సాగే ఈ వారంలో హౌస్‌లో రసవత్తర పోరు జరగనుంది. గతంలో ఎలిమినేట్ అయిపోయిన షాలినీ, అపూర్వ, రోహిత్ వంటి మాజీ కంటెస్టెంట్లు మళ్లీ హౌస్‌లోకి అతిథులుగా రాబోతున్నట్లు సమాచారం. వీళ్లే నేరుగా మిగిలిన కంటెస్టెంట్లతో నామినేషన్స్ ప్రక్రియను నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా కొందరు ఎక్స్ కంటెస్టెంట్లు వారం రోజుల పాటు హౌస్‌లోనే ఉండి డిక్టేటర్లుగా వ్యవహరిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
రాబోయే వారాల్లో మరింత పెరుగుతున్న టెన్షన్
ఇకపై హౌస్‌లో ఆట రంజుగా మారనుంది. మరో నాలుగు వారాల్లో ఫినాలేకు చేరాల్సి ఉండటంతో రాబోయే రోజుల్లో డబుల్ ఎలిమినేషన్లు ఉండే అవకాశం ఉంది. శ్వేత వెళ్ళిపోవడంతో ఇప్పుడు మిగిలిన కంటెస్టెంట్లు తమ బలమైన వ్యూహాలతో ముందుకు వస్తున్నారు. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన ఆర్కే, శివ్, నీతూ వంటి వారు తమ ఆటతీరుతో గట్టి పోటీ ఇస్తున్నారు. కొత్తగా రాబోయే డిక్టేటర్ల థీమ్ హౌస్‌లో ఎలాంటి గొడవలకు, సంచలనాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

Chiranjeevi: డీప్‌ఫేక్‌లపై చిరంజీవి పోరాటం.. కేంద్రానికి వినతిపత్రం
Bigg Boss 10: కెప్టెన్సీ టాస్క్‌లో రచ్చ రచ్చ.. ముకేష్ వర్సెస్ వర్షిణి మధ్య తీవ్ర వాగ్వాదం
Mahesh Babu: మహేశ్ బాబు ఇంట్లో పెళ్లి సందడి.. వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫొటోలు
Ramayana: రామాయణ మూవీకి షాక్.. వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన టీం