మంగళవారం, నవంబర్ 17, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఖాళీ రైలులో చెలరేగిన మంటలు

Fire Accident

Fire Accident: హైదరాబాద్‌లోని ప్రముఖ చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. స్టేషన్ ఆవరణలోని ప్లాట్‌ఫామ్ నంబర్ 5 అలాగే 6 మధ్య మెయింటెనెన్స్ పనుల నిమిత్తం ఓ ఖాళీ రైలును నిలిపి ఉంచారు. సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో ఆ రైలు చివరి బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు వేగంగా వ్యాపించడంతో పక్కనున్న బోగీలు కూడా అంటుకున్నాయి. దీంతో స్టేషన్ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఘటనా స్థలానికి ఫైరింజన్లు

రైలు బోగీల నుంచి మంటలు ఎగిసిపడటాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పాటు మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా అంటుకున్న బోగీల నుంచి మిగతా వాటిని వేరు చేశారు. వెంటనే రైల్వే పోలీసులు అలాగే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది పలు ఫైరింజన్ల సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.

ఇది కూడా చదవండి: RBI: లోన్ తీసుకున్నవారికి షాక్?.. డిసెంబర్‌లో మరోసారి వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్

ఊపిరి పీల్చుకున్న అధికారులు

ఈ ఘటనలో మొత్తం ఏడు రైలు బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో రైలు ఖాళీగా ఉండటం, సిబ్బంది వెంటనే స్పందించి ప్రయాణికులను దూరంగా ఉంచడంతో పెను ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. రైలు బోగీలు దగ్ధం కావడానికి అసలు కారణాలు ఏమిటనే దానిపై రైల్వే శాఖ అధికారులు ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, స్టేషన్‌లో సాధారణ రాకపోకలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.