Horoscope Today: ఈ రోజు వీరికి పట్టిందల్లా బంగారమే.. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం

Horoscope Today November 18, 2026: నవంబర్ 18, బుధవారం ద్వాదశ రాశుల వారికి గ్రహాల సంచారం ప్రకారం భిన్నమైన ఫలితాలు సూచిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి ఆర్థికంగా ఊరట లభించే అవకాశముంది. మరికొందరికి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించడంతో పాటు కొత్త అవకాశాలు తలుపుతట్టవచ్చు. వ్యాపారులకు లాభాలు, కుటుంబంలో శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి. అయితే కొన్ని రాశుల వారు ఖర్చులు, ఆరోగ్యం, ఉద్యోగంలో ఒత్తిడి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి నేటి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి
ఈ రోజు మేష రాశి వారికి ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. పనిచేసే చోట మీ ప్రతిభకు గుర్తింపు లభించడంతో పాటు అధికారుల నుంచి ప్రోత్సాహం అందుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. తోబుట్టువులతో ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులు కొత్త ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అయితే దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. ప్రధాన ఆదాయంతో పాటు అదనపు సంపాదనకు కొత్త మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా సాగుతాయి. ముఖ్యమైన ఆస్తి సంబంధిత పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ఉద్యోగులు కార్యాలయంలో వివాదాలకు దూరంగా ఉండాలి. కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురైనా ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. అనవసర ఖర్చులను అదుపులో పెట్టుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశాలను పొందే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా చేపట్టిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అయితే ఆస్తి, డబ్బు వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కొన్ని పనులు పూర్తిచేయడానికి అదనపు శ్రమ అవసరమవుతుంది.
ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు అదిరిపోయే గుడ్న్యూస్.. ఏకంగా రూ.8,600 పైగా తగ్గిన బంగారం ధర
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. పైఅధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహం అందుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగడంతో పాటు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. బంధువులు, స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. అయితే సహచరుల వల్ల ఆర్థికంగా నష్టం జరిగే సూచనలు ఉండటంతో డబ్బు లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఆహారపు అలవాట్ల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పైఅధికారులతో వ్యవహరించేటప్పుడు సంయమనం పాటించాలి. కొన్ని విషయాలు మానసిక ఆందోళనకు కారణం కావచ్చు. అయితే రియల్ ఎస్టేట్, రాజకీయాలు, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్నేహితులతో కలిసి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో చాలాకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం సాధారణంగా అనుకూలిస్తుంది.
కన్య రాశి
కన్య రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో బిజీగా గడుస్తుంది. అధికారులు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. వైద్యులు, న్యాయవాదులు వంటి వృత్తుల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా చేపట్టిన ప్రయత్నాలు అనుకున్నదానికంటే మెరుగైన ఫలితాలు ఇవ్వవచ్చు. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. ఇంటికి బంధువుల రాకపోకలు ఉంటాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
తుల రాశి
తుల రాశి వారికి ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. అయితే కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారులు కొత్త పద్ధతులు అనుసరించడం ద్వారా లాభాలు పొందవచ్చు. ఆదాయాన్ని పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలపై ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చాలాకాలంగా పరిష్కారం కాని వ్యక్తిగత సమస్య ఒకటి తొలగిపోయే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ అదనపు సంపాదన కోసం కొంత శ్రమించాల్సి వస్తుంది. ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెడతారు. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన బాధ్యతలు చేపట్టి సమర్థంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. గతంలో రావాల్సిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు లేదా సంతోషకరమైన పరిణామాలు చోటుచేసుకోవచ్చు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఇంటా బయటా కొంత ఒత్తిడి ఉన్నా అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
మకర రాశి
మకర రాశి వారికి ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. పైఅధికారుల నుంచి పని ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు మాత్రం నిలకడగా సాగుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంధువులతో మాట్లాడేటప్పుడు మాట పట్టింపులకు వెళ్లకుండా ఉండాలి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఆదాయం విషయంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకుంటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు కొనసాగించాలి. అయితే ప్రయాణాల్లో, ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం ఉంది.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగ పరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. స్వయం ఉపాధి, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు సంపాదనకు సంబంధించి చేపట్టిన ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. గతంలో ఇబ్బంది పెట్టిన ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించవచ్చు. అయితే బంధుమిత్రులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి.

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఉద్యోగంలో మంచి గుర్తింపు
Horoscope Today: ఈ రోజు ఆ రాశుల వారికి తిరుగులేదు.. అనుకున్న పనులన్నీ పూర్తి
Tirumala: శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్.. జస్ట్ రూ.5తో కుటుంబమంతటికీ శ్రీవారి దర్శన భాగ్యం
Horoscope Today: నేటి రాశి ఫలాలు (నవంబర్ 14, 2026).. ఈ రోజు మీకు ఎలా ఉండబోతోందంటే