BSNL New Plans: డేటా వద్దు.. కాల్స్ చాలు.. బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి మూడు చౌక రీఛార్జ్ ప్లాన్లు

BSNL New Plans: మొబైల్ రీఛార్జ్ ఖర్చులు పెరుగుతున్న సమయంలో ఇంటర్నెట్ వాడని వారికి బీఎస్‌ఎన్‌ఎల్ మంచి ఆప్షన్లు తీసుకొచ్చింది. ముఖ్యంగా రెండో సిమ్ వాడేవారు, ఫీచర్ ఫోన్లు ఉపయోగించేవారు, కాల్స్ కోసం మాత్రమే మొబైల్ నంబర్ ఉంచుకునేవారికి ఈ ప్లాన్లు ఉపయోగపడతాయి. రూ.172, రూ.184, రూ.190 ధరల్లో మూడు వాయిస్-ఓన్లీ రీఛార్జ్‌లను అందుబాటులోకి తెచ్చింది.
మూడు ప్లాన్లలో ఏది బెటర్?
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.172 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. రూ.184 ప్లాన్‌తో 30 రోజుల పాటు సేవలు పొందవచ్చు. ఇక రూ.190 ప్లాన్ ఒక క్యాలెండర్ నెల పాటు పనిచేస్తుంది. ఈ మూడింటిలోనూ లోకల్, ఎస్టీడీ, నేషనల్ రోమింగ్ కాల్స్ అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. అయితే మొబైల్ డేటా మాత్రం ఉండదు.
ఎవరికి ఉపయోగపడతాయి?
స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ కోసం మరో సిమ్ వాడుతూ, రెండో నంబర్‌ను కాల్స్ లేదా బ్యాంకు ఓటీపీలు, ఇతర ముఖ్యమైన మెసేజ్‌ల కోసం మాత్రమే ఉంచుకునేవారికి ఈ ప్లాన్లు ఉపయోగపడతాయి. అలాగే ఇంటర్నెట్ అవసరం లేని ఫీచర్ ఫోన్ వినియోగదారులకూ ఇవి సరైన ఎంపిక కావచ్చు. రోజువారీ డేటా అవసరం లేకపోయినా, కాలింగ్ కోసం ఎక్కువ ధర చెల్లించాల్సిన పరిస్థితిని ఈ తరహా ప్లాన్లు తగ్గిస్తాయి.
జియో, ఎయిర్‌టెల్‌తో పోలిస్తే..
ప్రైవేట్ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వీఐ కూడా డేటా లేని వాయిస్-ఓన్లీ రీఛార్జ్‌లను అందిస్తున్నాయి. జియోలో 28 రోజుల ప్లాన్ ధర రూ.177 కాగా, 30 రోజుల ప్లాన్ రూ.196, ఒక నెల ప్లాన్ రూ.197గా ఉంది. ఎయిర్‌టెల్, వీఐలోనూ ఇదే తరహా ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ధరతో పాటు వ్యాలిడిటీ, ఎస్ఎంఎస్ ప్రయోజనాలను కూడా పోల్చి చూసుకోవాలి.
రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ప్రత్యేకత
బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్లలో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభించడం ప్రత్యేకత. అంటే 28 రోజుల ప్లాన్‌లో మొత్తం 2,800 ఎస్ఎంఎస్‌లు పంపుకునే అవకాశం ఉంటుంది. జియో వంటి కొన్ని సంస్థల వాయిస్-ఓన్లీ ప్లాన్లలో మొత్తం వ్యాలిడిటీకి కలిపి 300 ఎస్ఎంఎస్‌లు మాత్రమే లభిస్తున్నాయి. అందువల్ల ఎక్కువగా మెసేజ్‌లు పంపేవారికి బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్లు ఉపయోగకరంగా ఉండొచ్చు.
TRAI ఆదేశాలతో ప్రత్యేక ప్లాన్లు
డేటా అవసరం లేని వినియోగదారులు కూడా కాలింగ్ కోసం డేటా కలిపిన రీఛార్జ్‌లు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యను తగ్గించేందుకు టెలికాం నియంత్రణ సంస్థ TRAI, కాల్స్, ఎస్ఎంఎస్‌లకు మాత్రమే ఉపయోగపడే ప్రత్యేక ప్లాన్లు అందించాలని ఆపరేటర్లను ఆదేశించింది. అందులో భాగంగానే బీఎస్‌ఎన్‌ఎల్ ఈ మూడు ప్లాన్లను తీసుకొచ్చింది. రీఛార్జ్ చేసే ముందు మీ టెలికాం సర్కిల్‌లో ప్లాన్ అందుబాటులో ఉందో లేదో బీఎస్‌ఎన్‌ఎల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఒకసారి పరిశీలించడం మంచిది.

Gold Price: ధంతేరస్ తర్వాత రూ.14,000 తగ్గిన బంగారం ధర.. పసిడి రేటు మళ్లీ రూ.లక్షకు దిగివస్తుందా?
Gold Price: బంగారం ధరలు మళ్లీ తగ్గాయ్.. హైదరాబాద్‌లో తులం రేటు ఎంతంటే?
Gold Price: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఏకంగా రూ.8,600 పైగా తగ్గిన బంగారం ధర
RBI: లోన్ తీసుకున్నవారికి షాక్?.. డిసెంబర్లో మరోసారి వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్