బుధవారం, నవంబర్ 25, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

Weather Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు

Weather Forecast

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీనికి తోడు నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఏపీలోని ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

అల్పపీడన ప్రభావం వల్ల రాబోయే 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఇప్పటికే మన్యం, అల్లూరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు పడుతున్నాయి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.

చెట్ల కింద ఉండొద్దు.. APSDMA కీలక హెచ్చరిక

వర్షాలతో పాటు బలమైన గాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. బలమైన గాలులు వీచే సమయంలో ఎవరూ చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద ఉండవద్దని APSDMA మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీజీఎస్ (RTGS) సీఈవో ప్రఖర్ జైన్ సూచించారు. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

ఇది కూడా చదవండి: AP Elections: ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన వారికి SEC షాక్.. ఈ లెక్కలు ఇవ్వకపోతే మూడేళ్లు ఇంటికే

తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

మరోవైపు అల్పపీడన ప్రభావం తెలంగాణపైనా కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో (రెండు రోజులు) తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్‌డేట్ ఇచ్చింది. వర్షాలతో పాటు రాష్ట్రంలో చలి తీవ్రత కూడా గణనీయంగా పెరిగింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు.

చలి, వర్షాల నేపథ్యంలో ప్రయాణికులు జాగ్రత్త

ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు చలి గాలులు వీస్తున్న తరుణంలో చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం వేళల్లో చలికి తోడు రోడ్లపై జారుడు పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించాలి.

Google వార్తల్లో మమ్మల్ని మీ ప్రాధాన్య వనరుగా జోడించండి

WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.