శుక్రవారం, నవంబర్ 27, 2026
తెలుగు వార్తలు... మీ కోసం...
తాజా వార్తలు:

Horoscope Today: ఈ రోజు ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారాల్లో మంచి పురోగతి!

Horoscope Today

Horoscope Today: నవంబర్ 27, 2026 శుక్రవారం. ఈ రోజు కొన్ని రాశుల వారికి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, ఆర్థికంగా మంచి అవకాశాలు ఎదురుకావచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. మరికొందరికి కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉండగా, కొందరు ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి నేటి దిన ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1):

మేష రాశి వారికి శుక్రవారం ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. పై అధికారులు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వాటిని సమర్థంగా పూర్తి చేసి మంచి గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు ఆశించిన దిశగా సాగుతాయి. ఆర్థికంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు పెరగవచ్చు. బంధువుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. ఆహారం, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి.

వృషభ రాశి (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):

వృషభ రాశి వారికి పనుల్లో కొంత శ్రమ ఉన్నా మంచి ఫలితాలు దక్కుతాయి. ఉద్యోగం, వ్యాపారాల్లో ఎదురయ్యే చిన్న సమస్యలను అధిగమిస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్న ఒకటి రెండు సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. సోదరులతో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అందవచ్చు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా అనుకూలిస్తుంది.

మిథున రాశి (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):

మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా మంచి లాభాలు పొందుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యల వల్ల ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలను సందర్శించే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు ఉపయోగపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి.

కర్కాటక రాశి (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):

కర్కాటక రాశి వారికి ఉద్యోగం, వృత్తి పరంగా అనుకూల సమయం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో ప్రయోజనం కలగవచ్చు. చేపట్టిన ప్రయాణాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త వినే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు సొంత ప్రాంతంలోనే ఉద్యోగం దక్కే సూచనలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు ప్రణాళిక వేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1):

సింహ రాశి వారికి శుక్రవారం ఉద్యోగంలో మంచి వాతావరణం ఉంటుంది. మీ పనితీరుకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు రావచ్చు. పిల్లల చదువులపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. జీవిత భాగస్వామికి దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఆస్తి సంబంధిత వివాదాల్లో అనుకూల ఫలితం రావచ్చు. మీ మాటతీరు, పనితీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

కన్య రాశి (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):

కన్య రాశి వారికి ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఇతరులకు అవసరమైనప్పుడు సాయం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలు కనిపిస్తాయి. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఆదాయం, ఖర్చులు దాదాపు సమానంగా ఉండవచ్చు. డబ్బు అప్పుగా ఇవ్వడం, తీసుకోవడం వంటి వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

తుల రాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):

తుల రాశి వారికి రోజంతా ఉత్సాహంగా గడిచే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం లభించవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూల సమయంగా చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: IPL 2027: ఒకే ఐపీఎల్ వేలం.. ఒకరు 41, మరొకరు 15.. ఇదేం కాంబినేషన్ బాబోయ్

వృశ్చిక రాశి (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ):

వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు, లక్ష్యాలు పెరిగే అవకాశం ఉంది. పనుల్లో బిజీగా గడుపుతారు. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త అందవచ్చు. కొంత శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. స్నేహితుల సహకారంతో ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.

ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):

ధనుస్సు రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. చేపట్టిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ప్రభుత్వ సంబంధిత పనుల ద్వారా డబ్బు అందే అవకాశం ఉంది. స్నేహితులకు ఆర్థికంగా సాయం చేయాల్సి రావచ్చు. బంధువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2):

మకర రాశి వారికి ఉద్యోగంలో అప్పగించిన పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. పిల్లలు చదువుల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి ఉద్యోగంలో పదోన్నతి లభించవచ్చు. కొందరు స్నేహితులు ఆర్థిక సాయం కోరే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు సులభంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశించవచ్చు. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

ఇది కూడా చదవండి: Indiramma House: పేదలకు తెలంగాణ సర్కార్ బంపర్ గిఫ్ట్.. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత రిజిస్ట్రేషన్

కుంభ రాశి (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):

కుంభ రాశి వారికి ఉద్యోగం, వృత్తి పరంగా పనులు సాఫీగా సాగుతాయి. వ్యాపారాల్లో పోటీదారులపై పైచేయి సాధించే అవకాశం ఉంది. ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకండి. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాలి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త అందవచ్చు. జీవిత భాగస్వామికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.

మీన రాశి (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):

మీన రాశి వారికి ఉద్యోగంలో పై అధికారుల సహకారం లభిస్తుంది. హోదా పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందవచ్చు. స్నేహితుల నుంచి పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. వృత్తి, వ్యాపారాలపై మరింత శ్రద్ధ పెట్టాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా అనుకూలిస్తుంది.

గమనిక: ఇవి జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా ఇచ్చిన సాధారణ దిన ఫలాలు మాత్రమే. వ్యక్తిగత జాతకం, గ్రహస్థితుల ఆధారంగా ఫలితాలు మారవచ్చు.

Google వార్తల్లో మమ్మల్ని మీ ప్రాధాన్య వనరుగా జోడించండి

WHAT'S YOUR REACTION?

CH. Rakesh Reddy

చింత రెడ్డి రాకేష్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, డిజిటల్ న్యూస్ రైటర్. తెలుగు జర్నలిజం రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన సాక్షి, వెలుగు, సమయం, ఎన్టీవీ, వన్ ఇండియా వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. బిజినెస్, ఆటోమొబైల్, సినిమా, లైఫ్‌స్టైల్, క్రీడలు, రాజకీయాలు, వైరల్ వార్తలు సహా అనేక విభాగాల్లో వార్తా కథనాలు రూపొందించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.